Tuesday, February 7, 2012

ఓ నయనం వర్షించే నీ కోసం..

నయనం వర్షించే నీ కోసం..
నీ రూపు చెరిపేయమంది మరునయనం...
పాదం కోరే నీవులేని లోకం వైపు పయనం..
నీ అడుగుల బాటలో సాగమంటుంది మరుపాదం...
అదరం అడిగే నీతో మాటలసమరం..
మౌనశాంతిన్ని ఆకాంక్షించే మరు అదరం...
మది ఆశించే నీ కౌగిలి భానిసత్వం..
విరహపు స్వేచ్ఛను కోరుతుంది నా హృదయం...
గతం పంచుకోమంది నీతో జీవితం..
ఒంటరిగా జీవించమంటుంది వర్తమానం...
ఇలా!
నన్ను రెండుగా చీల్చే నరకయాతన..
నీవు లేని నాతో నేను తెలుపగలనా?ఇకనైనా...

No comments: