నీ ఫ్రేమ ఎండమావన్ని తెలిసినా....
ఇంకొంచెం పరిగెత్తమంటుంది నా హృదయం..
ఓటమి తప్పదన్ని తెలిసినా...
నిన్ను ఎప్పటికైనా చేరుకుంటాను అని తన నమ్మకం...
తన నమ్మకం ఓడినా! ఆ ఓటమి గెలిచినా..
అటుపై శూన్యం నా జీవితం....
నా కవితలు ( నా హృదయ కొలను లోని కలువలు)
నా స్నేహితులందరికీ హాయ్ . నా పేరు కోన వెంకట సురేష్ బాబు. ఇక్కడ నేన్ను రాసిన కవితల లో నా మనసు కు మరీ మరీ హత్తుకు పోయిన వాటిని మీ అభిప్రాయాల కోసం ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను . నా కవిత లు చదివి మీ విలువైన సలహాలు కోరుతూ మీ " కోన వెంకట్"
Tuesday, February 7, 2012
ఓ నయనం వర్షించే నీ కోసం..
ఓ నయనం వర్షించే నీ కోసం..
నీ రూపు చెరిపేయమంది మరునయనం...
ఓ పాదం కోరే నీవులేని లోకం వైపు పయనం..
నీ అడుగుల బాటలో సాగమంటుంది మరుపాదం...
ఓ అదరం అడిగే నీతో మాటలసమరం..
మౌనశాంతిన్ని ఆకాంక్షించే మరు అదరం...
మది ఆశించే నీ కౌగిలి భానిసత్వం..
విరహపు స్వేచ్ఛను కోరుతుంది నా హృదయం...
గతం పంచుకోమంది నీతో జీవితం..
ఒంటరిగా జీవించమంటుంది వర్తమానం...
ఇలా!
నన్ను రెండుగా చీల్చే ఈ నరకయాతన..
నీవు లేని నాతో నేను తెలుపగలనా?ఇకనైనా...
నీ రూపు చెరిపేయమంది మరునయనం...
ఓ పాదం కోరే నీవులేని లోకం వైపు పయనం..
నీ అడుగుల బాటలో సాగమంటుంది మరుపాదం...
ఓ అదరం అడిగే నీతో మాటలసమరం..
మౌనశాంతిన్ని ఆకాంక్షించే మరు అదరం...
మది ఆశించే నీ కౌగిలి భానిసత్వం..
విరహపు స్వేచ్ఛను కోరుతుంది నా హృదయం...
గతం పంచుకోమంది నీతో జీవితం..
ఒంటరిగా జీవించమంటుంది వర్తమానం...
ఇలా!
నన్ను రెండుగా చీల్చే ఈ నరకయాతన..
నీవు లేని నాతో నేను తెలుపగలనా?ఇకనైనా...
Saturday, November 13, 2010
దాటదు కన్నీరు
దాటదు కన్నీరు నా కన్నుల ద్వారం
చూస్తూ అనునిత్యం నా కన్నుల నీ రూపం
ఆగదు ఓ క్షణం నీ జతలో సాగే నా పాదం
వింటూ ప్రతిక్షణం నీ అందెలసవ్వడి రాగం
కోరదు నా మది నూరేళ్ళ జీవితం
నవ్వుతూ ఓ శరం విసిరితే నీ అదరచాపం
ఆపదు నా హృదయకెరటం లాగుతున్నా ఆ మృత్యుగర్భం
లాలిస్తూ ఓ అరక్షణం నన్ను పెనవేస్తే నీ కౌగిలితీరం
సాగదు నిన్ను విడి నా ఉహలపయనం
విహరిస్తూ నీ తలపుల దారులలో మరిచింది ఈ లోకం
అడగదు ఏ వరం ఆ దైవాన్ని నా ప్రాణం
గడుపుతూ నీ జతలో ముగిసిపోతుంటే నా ప్రతి జన్మం

Thursday, October 14, 2010
నీ స్నేహం
నీవు చేరగా ఒంటరయ్యింది నా ఒంటరితనం
నీవు సాకగా దగ్గరయ్యింది నాకు నా హృదయం
నీవు చూపగా బంధువయ్యింది ఆనందం
నీవు చేర్పగా తొలిగిపోయింది విచారం
నీతో సాగగా ఆలసట మరిచింది నా పయనం
నీతో గడపగా సరికొత్తగా మారింది నా జీవితం
నీతో పంచుకోగా కన్నీటి భాధలను విడిచింది నా నయనం
నీతో జీవించగా అది క్షణమైనా వరమంటుంది నా ప్రాణం
నాలో మరణించిన ఆశలకి జీవం పోసింది నీ పరిచయం
నాలో ఆనందహరివిల్లు నిలిపింది నీ అపాయ్యత వర్షం
నాలో నీ మధుర స్ర్ముతులన్ని దాచుకొన్ని కలకాలం
నాలో హృదయస్పందనగా నిలిచిపొన్ని నీ స్నేహం

Thursday, September 16, 2010
కన్నుల కౌగిలింతలలో
కన్నుల కౌగిలింతలలో
శ్వాసల మేలరింపులలో
పెదవుల ఇరుకు యేతనలలో
ముద్దులాడుకోని మన హృదయాలన్ని బిగికౌగిలిలో
నీ యద సొగసుల తోల్లిసంధ్యాలలో
ఆ పొంగుల వెచ్చని తాకిడిలో
ఆ తాకిడి రేపే ప్రియ వేదనలో
మేల్కోని శృంగార తలపులు నా అణువణువులలో
కుడి ఎడమల తికమకలలో
అణువణువు చుంబనలలో
నీ ఒంపుసొంపుల సెలయేరు మునకలలో
తీర్చుకోని నా వలపు దాహాన్ని శృంగార రసక్రీడలలో
స్వేదపు పరిమళంలో
మన తనువుల పరవశంలో
నీ అందాల పులకరింపులలో
కరిగిపోని క్షణాలన్నీ మన సరసపు సైఆటలలో
నీ పొందుకోసం సాగే నిరీక్షణలలో
నా నిరీక్షణను నెరవేర్చే నీ పొందులలో
ఆ పొందులలో పొందే ఆనందంలో
సాగిపోని నా జీవితాన్ని ఈ మధురానుభూతులలో

Friday, August 13, 2010
Thursday, May 6, 2010
అమ్మ
నీ రూపు దోచుకున్ని నా స్వరూపాన్ని కూర్చుకున్నాను
నీ శ్వాసలన్ని నా ఉపిరిగా మార్చుకున్నాను
ఈ లోకాన్నికి రావటాన్నికి నిన్ను మరణం అంచున నిలిపాను
నన్ను లాలించే నిన్ను గుండెలపై తన్నాను
నడకలు నేర్పిన నీతో పరుగులు పెట్టించాను
తొలిపలుకులు నేర్పిన నీతోనే అబద్ధాలు చేప్పాను
మారాంతో నా ఇష్టాలను నీ ఇష్టాలుగా మార్చాను
కష్టం ఎదురైనా వేళ నీ వెనుక దాగి నిన్ను ముందు నిలిపాను
నీ ఓదార్పు కోసం నా భాదను నీకు పంచాను
నీ ప్రతి ఆలోచనలో నేనే నిండి నిన్ను ఒంటరిన్ని చేశాను
ఇలా నేను ఎన్ని చేసినా
నీ ఆణువణువూ నింపుకున్నావు నా పై ప్రేమతో
ప్రతి క్షణం గడిపావు ఆ ప్రేమను పంచాలనే ఆరాటంతో
కోరుకుంటున్నాను ఎన్ని జన్మలైనా నిన్నే నా అమ్మగా
నీయంతా ప్రేమను అమ్మగా నీకు పంచటం నాకు చేతకాక

Subscribe to:
Posts (Atom)