Monday, November 3, 2008

స్నేహం

జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం
తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం
ఒంటరిగా తనను చేరిన మనసుకు ఎన్నో మనసుల తోడు నిచ్చే ఆశ్రమం స్నేహం
ఎంత చిలిగిన అమృతం మాత్రమే ఇచ్చే పాల సముద్రం స్నేహం
తప్పులను సరిచేసి విజయాలను ప్రోత్సహించి మనుషులను మనుషులుగా మార్చే విద్యాలయం స్నేహం
తరాలు మారిన యుగాలు గడిచిన తరిగిపోని బండాగారం స్నేహం
తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపనిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం

నేస్తం

అమ్మ ఒడిని విడిచిన నన్ను నీ కౌగిలి లోకి చేర్చుకున్నావు
నాకు నేనుగా గుర్తింపు లేని వేళ నాన్నలా అండగా నిలిచావు
తడబడుతున్న నా అడుగులకు స్దిరత్వం నేర్పవు
నా గమ్యపు పయనం లో స్వేద తీర్చే మజిలి అయ్యావు
నా తగిలిన ఎదురు దెబ్బలను మాన్పే చల్లని మందుగా మారావు
బాధ తో తడిచిన నా కన్నులకు ఆనందపు భాష్పాల రుచిని చూపావు
ఒంటరితనం తో సాగే పోరు లో నాకు తోడుగా నీడగా నిలిచావు
అటుపోటుల లో సైతం నావలా నన్ను విజయతీరాలకు చేర్చావు
ఇన్ని చేసిన నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి నేస్తం
స్వార్ధం అనిపించినా ఎన్ని జన్మల కైనా కోరుకున్తన్నాను నీస్నేహం

Monday, October 27, 2008

నీకోసం

కదిలే నా కన్నులల్లో మెదిలే కలవో ?
నా గుండె చాటున ఎగిసిపడే అలవో ?
నా ఉహల రాగాన్నికి క్రొత్త శ్రుతివో ?
నా పెదవుల పై విరిసిన చిరునవ్వుల విరితోటవో?
నా వెంటాడే గత జన్మ జ్ఞాపకాన్నివో ?
నా కోసం వేచియున్న ఎన్నో జన్మల బందాన్నివో ?
నువ్వు నాకు ఎవ్వరివో ? నీకు నేను ఎవ్వరినో ?
తెలియక పోయినా ప్రశ్న లకు సమాధానం
వేచియుంది నా హృదయం నీకోసం

Monday, October 20, 2008

నువ్వు

కన్నుల వెనుక స్వప్నం నువ్వు
నా మాటల వెనుక మౌనం నువ్వు
నా శ్వాసల వెనుక స్పందన నువ్వు
నా విజయం వెనుక శ్రమ వి నువ్వు
నా భాధల వెనుక కన్నీరు నువ్వు
నా గమ్యం వెనుక పయనం నువ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నువ్వు
ఇలా
నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నువ్వు

Wednesday, April 9, 2008

ఎన్నాటికి మరువను నిన్ను ఓ నేస్తం

అలిసిన నా కన్నుల్లో కమ్మని కల చేరినప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
మూగబోయిన నా పెదవుల పై చిరునవ్వు విరిసిన్నప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం
ఆగక సాగే నా పయనం లో చల్లని మజిలి ఎదురైనప్పుడు : గుర్తుకొస్తుంది మా స్నేహం
నా హృదయపు ప్రతి స్పందన కు : గుర్తుకొస్తుంది మా స్నేహం .
నన్ను నేను తలుచుకున్న ప్రతి నిమిషం : గుర్తుకొస్తుంది మా స్నేహం .
అందుకే,
నన్ను విడిపోని నీ జ్ఞాపకాలతో సాగిస్తాను నా జీవితం
.ఎన్నాటికి మరువను నిన్ను ఓ నేస్తం

Tuesday, February 26, 2008

చెలి నీ తోలిముద్దు ఎంతా?మధురం

ఎన్నో జన్మల నీరిక్షణ నెరవెరిన ఆనందం
చంద్రుడు పైన తోలిసారిగా కాలు మోపిన సంతోషం
లోకాన్ని జయించిన విజయగర్వం
నన్ను నేనే మరిచిపోయ్ మైకం
అదృష్టమంతా నా సొంతమేనా?అనే అనుమానం.
నిజాన్ని నమ్మలేని అయోమయం.
ఇన్ని అనుభూతులకు కారణమైన
చెలి నీ తోలిముద్దు ఎంతా?మధురం

Friday, February 1, 2008

వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......

నువ్వు లేని నిజాన్ని నమ్మలేను
నిన్ను కల అని మరువలేను
నీ కలల హద్ధులు దాటలేను
నీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేను
నీ ఉహల కెరటాల తాకిడిని తాళలేను
నీ కౌగిలి తీరం చేరక నిలువలేను
నీ శ్వాసల స్పర్శ లేని గాలిని పీల్చలేను
నీ తలపులతో నిండిన ఉపిరిని ఆపలేను
అందుకే!
వేచియున్నాను మృత్యు సాగర తీరాన......