Monday, November 3, 2008

స్నేహం

జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం
తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం
ఒంటరిగా తనను చేరిన మనసుకు ఎన్నో మనసుల తోడు నిచ్చే ఆశ్రమం స్నేహం
ఎంత చిలిగిన అమృతం మాత్రమే ఇచ్చే పాల సముద్రం స్నేహం
తప్పులను సరిచేసి విజయాలను ప్రోత్సహించి మనుషులను మనుషులుగా మార్చే విద్యాలయం స్నేహం
తరాలు మారిన యుగాలు గడిచిన తరిగిపోని బండాగారం స్నేహం
తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపనిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం

2 comments:

హను said...

sneham gurimchi chala baga cheppaaru nice

k.v.sureshbabu said...

thank you for ur comment