Wednesday, February 20, 2013

నా ప్రేమ దేవత


వేయకే ఓ అడుగైనా  నా వైపుగా..
విసరకే ఓ చూపైనా నా పైకి వడిగా..
పలుకకే ఓ మాటైనా నా మనసుతో మౌనంగా..
వదలకే ఓ తలపునైనా నా మదికి ఎరగా..
ఇవ్వకే ఓ కలయైనా నా కన్నులకి వరంగా..
మార్చకే ఓ ఊసునైనా నా హృదయపు స్పందనగా..
చేరకే ఓ క్షణమైనా నా ప్రాణాన్నికి అయువుగా..
సాగకే ఓ ఘడియైనా నా జీవితపు తోడుగా ..
ఎందుకంటే???
నీ ఆలోచనలు ఓసారి నన్ను తాకితే మారతాను ఒంటరిగా    
అందుకే...
నిలువకే నా జతలో ఓ అతిధిగా..
నిలిచిపొవే ఎప్పటికి నా ప్రేమ దేవతగా..  
   

Thursday, February 14, 2013

రంజిత "శ్రీరంజిత"..

నీ చిలిపి చూపుల పలకరింపులతో..
నా మనసుకి గిల్లిగింతలు పెట్టావు..
నీ చిరునవ్వుల చిరుజల్లులతో..
నా మదిలో సరికొత్త ఆశలు రేపావు..
నీ పలుకుల పదనిసలతో..
మౌనం నా భాషగా మార్చావు..
నీ అందెల సవ్వడులతో..
నన్ను నాకు మరిచేలా చేశావు..
నీ ఊహల పరవళ్ళతో..
నీ గుండెని ప్రేమగొదవరిగా చేశావు..
నీ తలపులే అణువణువుపు అయువుగా చేసిన..
నా హుదయపు ప్రతి స్పందనపు పూజిత..
నా జీవితపు దివ్వె రంజిత "శ్రీరంజిత"..