Saturday, November 13, 2010

దాటదు కన్నీరు

దాటదు కన్నీరు నా కన్నుల ద్వారం
చూస్తూ అనునిత్యం నా కన్నుల నీ రూపం
ఆగదు ఓ క్షణం నీ జతలో సాగే నా పాదం
వింటూ ప్రతిక్షణం నీ అందెలసవ్వడి రాగం
కోరదు నా మది నూరేళ్ళ జీవితం
నవ్వుతూ ఓ శరం విసిరితే నీ అదరచాపం
ఆపదు నా హృదయకెరటం లాగుతున్నా ఆ మృత్యుగర్భం
లాలిస్తూ ఓ అరక్షణం నన్ను పెనవేస్తే నీ కౌగిలితీరం
సాగదు నిన్ను విడి నా ఉహలపయనం
విహరిస్తూ నీ తలపుల దారులలో మరిచింది ఈ లోకం
అడగదు ఏ వరం ఆ దైవాన్ని నా ప్రాణం
గడుపుతూ నీ జతలో ముగిసిపోతుంటే నా ప్రతి జన్మం

Thursday, October 14, 2010

నీ స్నేహం

నీవు చేరగా ఒంటరయ్యింది నా ఒంటరితనం
నీవు సాకగా దగ్గరయ్యింది నాకు నా హృదయం
నీవు చూపగా బంధువయ్యింది ఆనందం
నీవు చేర్పగా తొలిగిపోయింది విచారం
నీతో సాగగా ఆలసట మరిచింది నా పయనం
నీతో గడపగా సరికొత్తగా మారింది నా జీవితం
నీతో పంచుకోగా కన్నీటి భాధలను విడిచింది నా నయనం
నీతో జీవించగా అది క్షణమైనా వరమంటుంది నా ప్రాణం
నాలో మరణించిన ఆశలకి జీవం పోసింది నీ పరిచయం
నాలో ఆనందహరివిల్లు నిలిపింది నీ అపాయ్యత వర్షం
నాలో నీ మధుర స్ర్ముతులన్ని దాచుకొన్ని కలకాలం
నాలో హృదయస్పందనగా నిలిచిపొన్ని నీ స్నేహం

Thursday, September 16, 2010

కన్నుల కౌగిలింతలలో

కన్నుల కౌగిలింతలలో
శ్వాసల మేలరింపులలో
పెదవుల ఇరుకు యేతనలలో
ముద్దులాడుకోని మన హృదయాలన్ని బిగికౌగిలిలో
నీ యద సొగసుల తోల్లిసంధ్యాలలో
ఆ పొంగుల వెచ్చని తాకిడిలో
ఆ తాకిడి రేపే ప్రియ వేదనలో
మేల్కోని శృంగార తలపులు నా అణువణువులలో
కుడి ఎడమల తికమకలలో
అణువణువు చుంబనలలో
నీ ఒంపుసొంపుల సెలయేరు మునకలలో
తీర్చుకోని నా వలపు దాహాన్ని శృంగార రసక్రీడలలో
స్వేదపు పరిమళంలో
మన తనువుల పరవశంలో
నీ అందాల పులకరింపులలో
కరిగిపోని క్షణాలన్నీ మన సరసపు సైఆటలలో
నీ పొందుకోసం సాగే నిరీక్షణలలో
నా నిరీక్షణను నెరవేర్చే నీ పొందులలో
ఆ పొందులలో పొందే ఆనందంలో
సాగిపోని నా జీవితాన్ని ఈ మధురానుభూతులలో



Friday, August 13, 2010

ఏది నిజమైనా స్వాతంత్ర్యం ?

చీకటి తెరచాటు దాటి ముసుకేసుకున్నిలోకాన్ని చూడడమా? స్వాతంత్ర్యం.
పరవాడి చేర విడి సొంతవాడి దోపిడీకి గురికావడమా? స్వాతంత్ర్యం
స్వేచ్చ వాయువులు పీలుస్తూ అది అందించిన ప్రాణదాతల శ్వాసలు మారవడమా? స్వాతంత్ర్యం
నాడు తెల్లదొరలు సిరిసంపదలు దోచుకొన్ని మిగిల్చిన భారతమాత ప్రాణాలను
తన బిడ్డలే హరించడమా ? స్వాతంత్ర్యం
విధాత రాసిన తలరాతలను రాజకీయ నాయకులు తిరిగి రాయడమా? స్వాతంత్ర్యం
నా హక్కులంటూ ఈ దేశాన్ని మరిచి తానుకు తానే ఏ కాకిలా బ్రతకటమా?స్వాతంత్ర్యం
ఆర్దిక అసమానతలు , దోపిడీ, అశాంతి , ఆకలిచావులు ,స్వార్ధపు వర్ణాలతో
భారత భూమిన్ని నింపి త్రివర్ణపు జెండాకి వందనం చేయడమా ? స్వాతంత్ర్యం
ఏది నిజమైనా స్వాతంత్ర్యం ?ఎక్కడుంది నిజమైనా స్వాతంత్ర్యం ?
గాంధీ కన్న కలలు కనడం కాదు గాంధీ కన్నులతో ఈ లోకాన్ని
చూడగలిగినప్పుడే నిజమైనా స్వాతంత్ర్యం
స్వాతంత్ర్య పోరాట యోధుల చిత్ర పటాలు కొలువుతీర్చడం కాదు
వారి ఆశయాలు మనసులలో నింపుకోవడమే నిజమైనా స్వాతంత్ర్యం
ప్రతి భారతీయుడు తనను ఓ మనిషిగా కాదు ?
ఓ భారతీయుడిగా తనను తాను పరిచయం చేసుకోగలిగినప్పుడే
నిజమైనా స్వాతంత్ర్యం

Thursday, May 6, 2010

అమ్మ

నీ రూపు దోచుకున్ని నా స్వరూపాన్ని కూర్చుకున్నాను
నీ శ్వాసలన్ని నా ఉపిరిగా మార్చుకున్నాను
ఈ లోకాన్నికి రావటాన్నికి నిన్ను మరణం అంచున నిలిపాను
నన్ను లాలించే నిన్ను గుండెలపై తన్నాను
నడకలు నేర్పిన నీతో పరుగులు పెట్టించాను
తొలిపలుకులు నేర్పిన నీతోనే అబద్ధాలు చేప్పాను
మారాంతో నా ఇష్టాలను నీ ఇష్టాలుగా మార్చాను
కష్టం ఎదురైనా వేళ నీ వెనుక దాగి నిన్ను ముందు నిలిపాను
నీ ఓదార్పు కోసం నా భాదను నీకు పంచాను
నీ ప్రతి ఆలోచనలో నేనే నిండి నిన్ను ఒంటరిన్ని చేశాను
ఇలా నేను ఎన్ని చేసినా
నీ ఆణువణువూ నింపుకున్నావు నా పై ప్రేమతో
ప్రతి క్షణం గడిపావు ఆ ప్రేమను పంచాలనే ఆరాటంతో
కోరుకుంటున్నాను ఎన్ని జన్మలైనా నిన్నే నా అమ్మగా
నీయంతా ప్రేమను అమ్మగా నీకు పంచటం నాకు చేతకాక

Wednesday, April 28, 2010

చెల్లి

నా అమ్మ కడుపునా పుట్టి నాకు అమ్మగా మారావు
నేను అందిచిన లాలనను నేడు నాకు నాన్నలా పంచుతున్నావు
నా చిన్ననాటి ఆటలలో నాకు సరిజోడువి అయ్యావు
నేటి నా బ్రతుకాటలో నన్ను గెలిపించే గురువుగా ఎదిగావు
నా చేతి వేళ్లు పట్టుకున్ని నడకలు నేర్చావు
నేడు తడబడుతున్న నాకు మార్గదర్శిగా నిలిచావు
నేను చూపే చందమామన్ని చూస్తూ నా చేతి గోరుముద్దలు తిన్నావు
నేడు జాబిలమ్మ లా నా జీవితపు బాటలో వెన్నెలను కురిపిస్తున్నావు
నాడు నేను పాడిన జోలపాటలతో హాయిగా నిద్రపోయావు
నేడు నీ ప్రేమ తో నా హృదయాన్ని లాలిస్తున్నావు
ఇన్నాళ్ళు అన్న చాటు చెల్లి గా ఎదిగావు
నేడు ఈ అన్నకే అమ్మగా మారావు
నీ అన్నగా ఉండే అదృష్టం ఈ జన్మకి చాలు
మరుజన్మ కి నీకు అమ్మగా పుట్టి నీ ఋణం తీర్చుకొనివ్వు

Thursday, April 22, 2010

నా ఆఖరి ఆప్తుడు

నీ ఎడబాటు లో తన తోడుటుందన్న ఆశ కలిగించి
సాగుతుంది నేడు నీ తలపులు తాకగానే నన్ను విడిచి
ఎంతగా ఆపినా నా చేతిన్ని అడ్డుగా ఉంచి
ఇసుమంతైనా జాలి లేక పోతుంది నన్ను విదిల్చి
సాగింది నా జీవితం నీ జతలో తనన్ని మరిచి
నేడు ఎలా ఉండగలదు నా మాట మన్నించి
నా పై కోపమో ? నీ పై ఇష్టమో తెలియని అయోమాయపు స్దితి
కారణం ఏదైనా ఇక సాగాలి ఒంటరిగానే నా గతి
నా కన్నులు మూసి నీ కౌగిలి చేరే నా ఆఖరి ఆప్తుడిని ఆదరించి
కాలకాలం నీ పెదవుల పై నిలుపుకో చిరునవ్వులుగా మార్చి

Saturday, March 20, 2010

మరణం నాకు వరమే

మరణం నాకు వరమే
నీ మాటలు కరువైన వేళలో
బ్రతుకు నాకు శాపమే
నీ పెదవులపై చిరునవ్వు మాయమైన క్షణంలో
ఏకాంతం నాకు మిత్రుడే
నీ అడుగులు నన్ను విడిచిన వేళలో
సానిహిత్యం నాకు శత్రువే
నీ చూపుల కెరటాలు నన్ను తాకని క్షణంలో
శూన్యం నాకు దైవమే
నీ తలపుల తలుపులు మూసుకుపోయిన వేళలో
లోకం నాకు కలయే
నీ ఎడబాటు వాకిలి ద్వారం తెరచుకున్న క్షణంలో
యుగం బాటు సాగిన ఆ జీవనం వ్యర్ధమే
నీ మమతల చిరుజల్లు కురవని వేళలో
జీవితం ఓ క్షణమైనా భాగ్యమే
నీ లాలన పొందే క్షణంలో


Friday, March 12, 2010

నాకై నీ మాటల చిరుజల్లు కురిపించు

నీతో మాట్లాడుతుంటే నాలో ఎన్నో ఆశలు పెరుగుతున్నాయి
నీ పెదవులు ఇక సెలవంటూ సాగుతుంటే నన్ను విడిపోతున్నాయి
నా ఆశలకు ఆయువు క్షణకాలమాన్ని
అవి ఎప్పటికి నీ సొంతమాన్ని
తెలియని నా మనసు వాటి ఎడబాటుతో మూగబోతుంది
తన ఆశలను తిరిగి తన దరికి చేర్చమాన్ని ఆర్దిస్తుంది
నా మనసు వేదన విని ఇకనైనా కరుణించు
నాకై నీ మాటల చిరుజల్లు కురిపించు

Sunday, February 14, 2010

నీ పిలుపు కోసం వేచ్చిచుస్తున్నా

నిన్నలా , మొన్నలా నువ్వున్నా
నేడు ఏదో తెలియని ఆలాపన నాలోన
నీ శ్వాసలు తాకితేనే నన్ను నేను మైమర్చిపోతున్నా
నీ అడుగుల సవ్వడిలో ప్రతిరోజు గడపాలనుకుంటున్నా
నీ చిరునవ్వుల వేకువ కోసం నిరీక్షణ చీకటిన్ని భరిస్తున్నా
నీ మాటల చిరుజల్లుకే పుడమిలా పులకరిస్తున్నా
నీ ఒరచూపుకే నన్ను నేను భానిసను చేస్తున్నా
నువ్వు నాకు దగ్గరవుతున్న క్షణమైనా అలా నిలిచిపోవలనుకుంటున్నా
నువ్వు దూరమై అర క్షణమైనా విరహవేదన భరించలేకున్నా
ఇంకా ఎన్నో చెప్పలేని భావాలు కలుగుతున్నా
ఎందుకో తెలియక సతమమవుతున్నా
అందుకే నా వేదనను నీకు తెలియజేస్తూ నీ పిలుపు కోసం వేచ్చిచుస్తున్నా

Thursday, February 11, 2010

" మనిషి ప్రేమ"

క్షణక్షణమున అణువణువునా కరుగుతున్నా తన వెలుగును
లోకాన్నికి పంచక మానదు ద్వీపం ప్రేమ
తోలి స్పర్శతో పరవశం కలిగించి తన రూపును దోచుకుంటున్నా
క్రాంతి ని అడ్డుకొద్దు చీకటి ప్రేమ
ఎగిసిపడుతూ వచ్చి తాకి మరుక్షణంలో తనన్ని విరహలో
ముంచి పోయే కెరటాలను ఆపదు తీరం ప్రేమ
రూపు లేకుండా తన ఒడిన్ని చేరి రూపు వచ్చినక
తనన్ని ఒంటరిన్ని చేసి పోయే చినుకు పై ద్వేషం పెంచుకొద్దు నింగి ప్రేమ
బిడ్డలా ఒడిన్ని చేర్చుకున్ని సాకిన తన గుండెనే చీల్చి
ఎదుగుతున్న మొక్కను నాశనం చేయద్దు నేల ప్రేమ
తన ఉనికి తో తమ మనుగడను సాగిస్తున్నా
ప్రతిగా ఎటువంటి ఫలం ఇవ్వకున్నా జీవకోటిన్ని విడిపోద్దు వాయువు ప్రేమ
ఇలా
తన చుట్టూ ఉన్న ప్రేమలలో ఒక్క ప్రేమన్ని ఆదర్శంగా తీసుకున్న
చిరకాలం మధురస్ముతిగా నిలుస్తుంది " మనిషి ప్రేమ"

Tuesday, February 9, 2010

విజేత

అనుమతిస్తావా? నీ సిగలోకి
నే సంపంగి లా చేరగా
తాకనిస్తావా ? నీ పాదాలన్ని
నే పారాణిగా మారగా
చేరనిస్తావా? నీ హృదయ లోగిలికి
నే ప్రేమ కిరణంగా తాకగా
కరుణిస్తావా? నా పేద హృదయాన్ని
నీ ప్రేమకై ఆర్ధించగా
చూపిస్తావా? నా కన్నులకు లోకాన్ని
నీ జతలో సరిక్రొత్త గా
లాలిస్తావా? నా మనసు ను
పసిపాప లా నీ ఒడికి చేరగా
ఏలనిస్తావా నీ నూరేళ్ళ జీవితాన్ని
నీ మనసు గెలుచుకున్న విజేత గా