Friday, November 27, 2009

ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ ఒంటరి పయనం ?

నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల తెన్నెలలో కూర్చున్నాను ఒంటరిగా
నీ తోడు లేని నా పాదాలు తాకి వెనక్కిపోతున్నాయి కెరటాలు మౌనంగా
నీ కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లచలేక
మారుతున్నాయి శీతల పవనాలు వెచ్చగా
నా హృదయఘోషకి దిగ్భాంతి చెంది చూస్తుంది సాగరం వింతగా
నా మనసు లోని నీ తలపుల వెల్లువ ప్రోగింది కన్నీరుగా
శాంతించింది నా హృదయం నువ్వు పంపిన ఓదార్పు చిరుజల్లు తాకగా
ఇలా నీ ఓదార్పుతో నేను ప్రతిరోజు గడుపుతున్నా?
ఎన్నాళ్ళు నువ్వు లేని ఒంటరి పయనం ?

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవిత గ్రంధం

నన్ను చేరితే నీ అదేలసవ్వడి లో రాగం
నా మనసులో విరిసే ఆలనాటి బృందవనం
నన్ను తాకితే నీ కన్నుబోమ్మల విల్లు నుండి బాణం
ఆనంద డోలికాలు ఊగే నా హృదయం
నన్ను తాకితే నీ చిరునవ్వుల కడలి లో తరంగం
నా జన్మంతా నీకు దాసోహం
నేను పొందగలిగితే నీ మాటల పాలసంద్రం లోని అమృతం
హాయిగా సేవిస్తాను నిరీక్షణ హాలాహలం
నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం
నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం
ఇక!
నాకు ఇవ్వగలిగితే నీ నూరేళ్ళ ప్రేమ సంతకం
అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవిత గ్రంధం

Tuesday, November 17, 2009

నీ ప్రేమ కోసం

కన్నీరే నాకు మిగిల్చినా
కరిగిపోదు నా కంటి పాప లో నీ రూపం
నీ ఎడబాటు నా బాట గా మార్చినా
ఆగదు నీ జ్ఞాపకాల బాట లో నా పయనం
నా మాటలన్ని దోచుకొన్ని మూగన్ని చేసినా
ఆపలేను నీ ఉసులు పలకడం
నీ ఉహల తెరచాప ను చీల్చి నడిసంద్రం లో నిలిపిన
చేర్చుతాను నా హృదయ నావ ను నీ ప్రేమ తీరం
నా ఆశల సెలయేరు ను ఎండమావి గా చేసినా
ఆగదు ఆన్వేషణ నీ చిరునవ్వు తడికోసం
నీ విరహ వేదన లో ప్రతి క్షణం మరణిస్తున్నా
జన్మిస్తున్నా మరుక్షణం నీ ప్రేమ కోసం

మా కాలేజి రోజులు

గడిపేది కొన్ని రోజులు
మిగిలేవి ఎన్నో జ్ఞాపకాలు
దరికి చేరిన మోహమాటం తో కదలని పెదవులు
విడిపోతూ భాదతో పలకలేని మాటలు
పరిచయం లేని దారుల లో సాగని అడుగులు
నడిచిన దారుల ను విడలేక కదలని పాదాలు
స్నేహం కోసం చూసే ఎదురుచూపులు
స్నేహితుల్ని విడిపోతూ వీడ్కోలు పలికే ఆఖరి చూపులు
బయట పెట్టలేని మనసు వెనక మాటలు
మనసు లోనే దాచుకోవటాన్నికి మిగిలే స్నేహాలు
ఇవే !
సంతోష సంద్రం లో నిలువెల్ల తడిపి
అంతలోనే కన్నీటి సుడిగుండం లో కి త్రోసే
మా కాలేజి రోజులు