Tuesday, December 29, 2009

"స్వ"రూపమంటూ లేని నా జీవితాన్నికి
"రూ"పు తేచ్చి కొత్తరంగులు అద్దిన వర్ణం నువ్వు
నేను
""లకలేక యదమాటున మోడు భార్చిన
ఆశల
"కి" చిరునవ్వు జల్లుతో జీవం పోసిన మేఘం నువ్వు
పలకరి౦
"పు" కూడా నా మనసుకి కరువైన వేళ
నన్ను వెన్నుత
"ట్టి" బ్రతుకు దారిలో నడిపిన క్రాంతి వి నువ్వు
నా అడుగడుగు
"" ఎదురై అవమానపు సెగలతో రగిలే
నా హృదయాన్ని ప్రతి
"రో"జు చల్లని మాటలతో ఓదార్చే వెన్నెలవి నువ్వు
నా మదిలో శిధిలమై బూ
"జు" పట్టిన నా ఆశలన్నీ
నీ స్నేహం తో సరికొత్తగా
"శు"తి చేసిన రాగం నువ్వు
నా జీవితపు పయనంలోని
"భా"రాన్ని తొలగించి
హాయిన్నిచే మధురమైన వ్యాప
"కాం" నువ్వు
ఎన్నాటికి నా మనసు పలికే పంచా
"క్షా"రి మంత్రం నువ్వు
గడిపేస్తాను నిండునూరేళ్లు ఇస్తే చా
"లు" నీ చిన్ని చిరునవ్వు

Friday, December 18, 2009

జై సమైక్యాంధ్రప్రదేశ్. జై జై సమైక్యాంధ్రప్రదేశ్.

తెలుగుతల్లి గుండె చేల్చి చూపేది ఇదేమి ప్రేమరా
తల్లి చీరను పరచి సాగితే అదేమీ ప్రగతి రా
నీ రెండు కన్నులు వేరన్ని తలచకు రా
నీ కన్ను నువ్వే పోడుచుకున్ని వెలుగు కోసం వెతకకు రా
స్వార్దపరుల మాటల మత్తులో మునిగి తేలకురా
నువ్వు , నేను వేరు కాదన్ని మరువకురా
అమ్మ ప్రేమలో వాటాలు తప్పు కాదురా
అమ్మనే వాటాలు చేసేది అదేమీ పనిరా
ఉచ్వాస, నిశ్వాస కలిస్తేనే శ్వాస రా
అందులో ఒక్కటి లేకున్నా గుండె స్పందన ఆగిపోవును రా
వేరుకుంపటి తెలుగుతల్లి గుండె లో మంట రా
కలిసి ఉంటేనే అది తరగని సిరుల పంట రా
జై సమైక్యాంధ్రప్రదేశ్. జై జై సమైక్యాంధ్రప్రదేశ్.