Tuesday, November 6, 2007

ఓ జాబిలమ్మ

చూడబోతే సిగ్గుతో నల్లమబ్బుల చాటుగా దాగుతావు
చూపు తిప్పగానే తోంగి చూస్తూ దొబుచులు ఆడతావు
ఏవో ఉసులు చెప్పబోతే కన్నుగిట్టి ఆపుతావు
మూగబోయిన నన్ను చూసి కొంటెగా నవ్వుతావు
కోపంతో ముఖం తిప్పుకుంటే
ప్రేమతో బుజ్జగిస్తావు
కొంటె ఉసులాడుతు నన్ను నవ్విస్తావు
తనివి తీరకుండానే సెలవంటూ సాగుతావు
నా మదిలో సిరివెన్నెలు కురిపించే ఓ జాబిలమ్మ
మరల నీ దర్శనం ఎప్పుడమ్మా?

Monday, November 5, 2007

కారుచీకటీలో తోడు రాదు

కారుచీకటీలో తోడు రాదు
నీకు నీ సైతం
చిరుదివ్వె వెలిగించి సాగితే
నీ వెనకే వస్తుంది ఈ లోకం
కష్టాలు వచ్చాయి అని క్రుంగిపొతే సాగదు నీ జీవితం
చిరుప్రయత్నం తో ముందడుగు వేస్తే కాగలవు
ఎందరికో ఆదర్శం.