Wednesday, April 28, 2010

చెల్లి

నా అమ్మ కడుపునా పుట్టి నాకు అమ్మగా మారావు
నేను అందిచిన లాలనను నేడు నాకు నాన్నలా పంచుతున్నావు
నా చిన్ననాటి ఆటలలో నాకు సరిజోడువి అయ్యావు
నేటి నా బ్రతుకాటలో నన్ను గెలిపించే గురువుగా ఎదిగావు
నా చేతి వేళ్లు పట్టుకున్ని నడకలు నేర్చావు
నేడు తడబడుతున్న నాకు మార్గదర్శిగా నిలిచావు
నేను చూపే చందమామన్ని చూస్తూ నా చేతి గోరుముద్దలు తిన్నావు
నేడు జాబిలమ్మ లా నా జీవితపు బాటలో వెన్నెలను కురిపిస్తున్నావు
నాడు నేను పాడిన జోలపాటలతో హాయిగా నిద్రపోయావు
నేడు నీ ప్రేమ తో నా హృదయాన్ని లాలిస్తున్నావు
ఇన్నాళ్ళు అన్న చాటు చెల్లి గా ఎదిగావు
నేడు ఈ అన్నకే అమ్మగా మారావు
నీ అన్నగా ఉండే అదృష్టం ఈ జన్మకి చాలు
మరుజన్మ కి నీకు అమ్మగా పుట్టి నీ ఋణం తీర్చుకొనివ్వు

Thursday, April 22, 2010

నా ఆఖరి ఆప్తుడు

నీ ఎడబాటు లో తన తోడుటుందన్న ఆశ కలిగించి
సాగుతుంది నేడు నీ తలపులు తాకగానే నన్ను విడిచి
ఎంతగా ఆపినా నా చేతిన్ని అడ్డుగా ఉంచి
ఇసుమంతైనా జాలి లేక పోతుంది నన్ను విదిల్చి
సాగింది నా జీవితం నీ జతలో తనన్ని మరిచి
నేడు ఎలా ఉండగలదు నా మాట మన్నించి
నా పై కోపమో ? నీ పై ఇష్టమో తెలియని అయోమాయపు స్దితి
కారణం ఏదైనా ఇక సాగాలి ఒంటరిగానే నా గతి
నా కన్నులు మూసి నీ కౌగిలి చేరే నా ఆఖరి ఆప్తుడిని ఆదరించి
కాలకాలం నీ పెదవుల పై నిలుపుకో చిరునవ్వులుగా మార్చి