Wednesday, April 28, 2010

చెల్లి

నా అమ్మ కడుపునా పుట్టి నాకు అమ్మగా మారావు
నేను అందిచిన లాలనను నేడు నాకు నాన్నలా పంచుతున్నావు
నా చిన్ననాటి ఆటలలో నాకు సరిజోడువి అయ్యావు
నేటి నా బ్రతుకాటలో నన్ను గెలిపించే గురువుగా ఎదిగావు
నా చేతి వేళ్లు పట్టుకున్ని నడకలు నేర్చావు
నేడు తడబడుతున్న నాకు మార్గదర్శిగా నిలిచావు
నేను చూపే చందమామన్ని చూస్తూ నా చేతి గోరుముద్దలు తిన్నావు
నేడు జాబిలమ్మ లా నా జీవితపు బాటలో వెన్నెలను కురిపిస్తున్నావు
నాడు నేను పాడిన జోలపాటలతో హాయిగా నిద్రపోయావు
నేడు నీ ప్రేమ తో నా హృదయాన్ని లాలిస్తున్నావు
ఇన్నాళ్ళు అన్న చాటు చెల్లి గా ఎదిగావు
నేడు ఈ అన్నకే అమ్మగా మారావు
నీ అన్నగా ఉండే అదృష్టం ఈ జన్మకి చాలు
మరుజన్మ కి నీకు అమ్మగా పుట్టి నీ ఋణం తీర్చుకొనివ్వు

2 comments:

నేను మీ నేస్తాన్ని said...

chaala bagundi andi...

avunandi... chelli yeppudu talle nandi


ooo naa peru cheppaledu kada... naa peru seshagiri nenu tirupati nundi andi..

Unknown said...

చెల్లిని ఇంతలా ప్రేమించే అన్న కు వందనం