Monday, November 3, 2008

స్నేహం

జాతి,కుల, మత సరిహద్దులు లేని విశాలమైన సామ్రాజ్యం స్నేహం
తనను ఆశ్రయించిన వారి భారాలను దించి సేద తీర్చే ఉద్యానవనం స్నేహం
ఒంటరిగా తనను చేరిన మనసుకు ఎన్నో మనసుల తోడు నిచ్చే ఆశ్రమం స్నేహం
ఎంత చిలిగిన అమృతం మాత్రమే ఇచ్చే పాల సముద్రం స్నేహం
తప్పులను సరిచేసి విజయాలను ప్రోత్సహించి మనుషులను మనుషులుగా మార్చే విద్యాలయం స్నేహం
తరాలు మారిన యుగాలు గడిచిన తరిగిపోని బండాగారం స్నేహం
తనకు సొంతరూపం, ప్రాణం లేకున్న అందరికి రూపనిచ్చి ప్రాణంగా నిలిచేది స్నేహం

నేస్తం

అమ్మ ఒడిని విడిచిన నన్ను నీ కౌగిలి లోకి చేర్చుకున్నావు
నాకు నేనుగా గుర్తింపు లేని వేళ నాన్నలా అండగా నిలిచావు
తడబడుతున్న నా అడుగులకు స్దిరత్వం నేర్పవు
నా గమ్యపు పయనం లో స్వేద తీర్చే మజిలి అయ్యావు
నా తగిలిన ఎదురు దెబ్బలను మాన్పే చల్లని మందుగా మారావు
బాధ తో తడిచిన నా కన్నులకు ఆనందపు భాష్పాల రుచిని చూపావు
ఒంటరితనం తో సాగే పోరు లో నాకు తోడుగా నీడగా నిలిచావు
అటుపోటుల లో సైతం నావలా నన్ను విజయతీరాలకు చేర్చావు
ఇన్ని చేసిన నీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి నేస్తం
స్వార్ధం అనిపించినా ఎన్ని జన్మల కైనా కోరుకున్తన్నాను నీస్నేహం