Monday, October 15, 2007

నా గుండె మాటూన్న

నీఫైన ప్రేమంతా దాగిఉన్న నా గుండె మాటూన్న
నాలోని ఆశలన్ని నీ కై వేచియున్న .....
నా జీవీతమే నీకోసం అని చెబుతున్నా
నా కనులల్లో నీ కలలే కంటూన్న..
నిత్యం నీ ఊహలలో విహరిస్తున్నా .......
చూపలేవా ? కొంచెం ప్రేమేనా ?
ఈ నిమిషం నా పైనా ?

నా చిగురాశ.........

సాగరకెరటాలు నీ పాదాలను తాకుతున్నప్పుడు
చల్లని గాలి నీ చెంపలన్ని తాకి మురిసిపోతున్నప్పుడు
సాగరం సైతం మౌనంగా నీ మాటలను వింటున్నప్పుడు
వెన్నెల మోమును తాకి మెరిసిపోతున్నప్పుడు
నీ ఉచ్వాస నీచ్వాస మాత్రమే నా చెవులను చేరుతున్నప్పుడు
నా మనసు నిండా నీ చిరునవ్వు నిండినప్పుడు
నీవ్వు తప్ప మరెవ్వరు గుర్తురానప్పుడు
అటువంటి క్షణాన..
నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలన్ని
నా చిగురాశ.........

Saturday, October 13, 2007

నీవ్వున్నది నా కోసం

నీవ్వున్నది నా కోసం
నేనున్నది నీ కోసం
నడిమధ్యలో లోకం
మనకెందుకు నేస్తం
ఇస్తాను నీకు నవలోకం
ఇంకా సంతోషమంతా మన సొంతం.

Friday, October 12, 2007

అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని ఈ నిమిషం

కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపోతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకు ఇష్టమైన గతం
ఆగిపోదు కష్టామన్ని వర్తమానం
ఎన్ని అటుపోటులు ఎదురైన ఆగదు నీ హృదయం
అది ఆగేసరికి మిగలదు జీవితం
మరెందుకు నీ దరికి రాని వాటికై ఆరాటం
అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని నిమిషం

Tuesday, October 9, 2007

క్షణక్షణముకో

క్షణక్షణముకో మరణం
క్షణక్షణముకో జననం
నీ ప్రేమ పోందలేని ప్రతి క్షణం
కోరుతుంది మరణం
మరల నీ ప్రేమక్తె కోరుతుంది మరు జననం
ఇదే !
నిత్యం నా మదిలో జరిగే అంతర్మధనం....

మార్చుకో నన్ను

మార్చుకో నన్ను నీ అదెల సవ్వడిగా
చేర్చుకో నన్ను నీ సిగలో పువ్వుగా
నిలుపుకో నన్ను నీ మాటల్లొ మౌనంగా
కొలువుంచుకో నీ కన్నులలో ఓ కలలా
మిగలనివ్వు నన్ను ఓ జ్ఞాపకంలా
అదివ్వు పొందుతాను ఆ మరణం సైతం హాయిగా
గడపలేను నిమిషం కూడా నివ్వు తోడు లేకుండా......

కోరుకోవు నా కన్నులు

కోరుకోవు నా కన్నులు నిన్ను చూపని కలలు
సాగవులే నా అడుగులు తోడులేక నీ పాదాలు
మూగబోవ నా మాటలు
కదలకుంటే నీ పెదవులు
మేదలవు నా మదిలో ఊహలు,
చూపుతుంటే నీ ప్రేమలో నవలోకాలు
గడిపితే చాలు నీ ఒడిలో కొన్ని నిమిషాలు,
దానికి బదులుగా ఇస్తాను నా ప్రాణాలు.