Monday, October 15, 2007

నా చిగురాశ.........

సాగరకెరటాలు నీ పాదాలను తాకుతున్నప్పుడు
చల్లని గాలి నీ చెంపలన్ని తాకి మురిసిపోతున్నప్పుడు
సాగరం సైతం మౌనంగా నీ మాటలను వింటున్నప్పుడు
వెన్నెల మోమును తాకి మెరిసిపోతున్నప్పుడు
నీ ఉచ్వాస నీచ్వాస మాత్రమే నా చెవులను చేరుతున్నప్పుడు
నా మనసు నిండా నీ చిరునవ్వు నిండినప్పుడు
నీవ్వు తప్ప మరెవ్వరు గుర్తురానప్పుడు
అటువంటి క్షణాన..
నీ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలన్ని
నా చిగురాశ.........

No comments: