Friday, November 27, 2009

ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ ఒంటరి పయనం ?

నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల తెన్నెలలో కూర్చున్నాను ఒంటరిగా
నీ తోడు లేని నా పాదాలు తాకి వెనక్కిపోతున్నాయి కెరటాలు మౌనంగా
నీ కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లచలేక
మారుతున్నాయి శీతల పవనాలు వెచ్చగా
నా హృదయఘోషకి దిగ్భాంతి చెంది చూస్తుంది సాగరం వింతగా
నా మనసు లోని నీ తలపుల వెల్లువ ప్రోగింది కన్నీరుగా
శాంతించింది నా హృదయం నువ్వు పంపిన ఓదార్పు చిరుజల్లు తాకగా
ఇలా నీ ఓదార్పుతో నేను ప్రతిరోజు గడుపుతున్నా?
ఎన్నాళ్ళు నువ్వు లేని ఒంటరి పయనం ?

5 comments:

కెక్యూబ్ వర్మ said...

మీ కవితలు మీ హృదయ నైర్మల్యాన్ని తెలుపుతున్నాయి. రాయండి ఇంకా... అభినందనలతో.

k.v.sureshbabu said...

thankq varma gaaru

vicky said...

సూపర్..

More Bhasker said...

నేను మీ కవితని వాడుకోవచ్చా

మంతెన ఆదిత్య వర్మ said...

సూపర్