Tuesday, September 22, 2009

y.s.r కి చిరు కవిత నివాళి

పేద వాడికి దూరమైన ఆశలను
నీ పాదయాత్ర తో మరల వారి దరికి చేర్చావు
కడుపు కాలి అలమటించే ప్రజలకు
కేజీ రెండు రూపాయిల పధకం తో వారి ఆకలిని తీర్చావు
ఆర్దిక భారం తో జీవితపు తెరచాపలు చినిగిపోయిన ఎన్నో జీవితాలకు
పావలా వడ్డీ రుణాలను ఇచ్చి వారిని సుఖ తీరాలకు చేర్చావు
చినుకు తడి లేక బీటలు పడిన రైతు గుండెలను
జలయజ్ఞం తో ఆకాశ గంగ ను నేలకు దింపి భాగీరదుడివి అయ్యావు
ఎందరో మంది నిరోద్యోగులకు ఉపాధి పధకాలతో క్రొత్త జీవితాలను ఇచ్చావు
మరెందరో విద్యార్దుల విద్య కు ఉన్నత అవకాశాలు ఇచ్చి
వారి భవిష్యత్తు కు బంగారు బాటలు వేశావు
ఆర్దిక అసమానతలు, రక్తాన్ని చిందించే ఉగ్రవాదాలు, రైత్తన్న ఆకలిచావులు,
పసిపిల్లల ను కబళించే మహంమరి లు , తెలుగు అక్కచెల్లల కన్నీటి దారాల తో
నిత్యం గుండెలు రగిలి పోతున్న "తెలుగు తల్లి " కి శాంతిని ఇచ్చి
తల్లికి ముద్దు బిడ్డవి , పది కోట్ల ప్రజలకు అన్నవి అయ్యావు
మరి నేడు తల్లి ఒడిని విడిచి ఆంధ్రప్రదేశ్ ని అనాధాన్ని చేశావా ? రాజశేఖరా ?
నువ్వు లేక దిక్కు తోచన్ని నీ అక్క చెల్లెలు , అన్నదమ్ములు కోసం జగన్మోహుడు లా తిరిగి రావా?

No comments: